అదనపు ఆదాయం కోసం వెదురు, ఈత, టేకు మొక్కలను రైతులకు ఇచ్చి ప్రోత్సహించాలి

*శాఖల మధ్య సమన్వయం, జవాబుదారీతనం తోనే హరితహారం విజయవంతం**సీజన్ లో పాల్గొనటమే కాదు, ఏడాది పొడుగునా సంరక్షణకు శాఖలే బాధ్యత వహించాలి**అదనపు ఆదాయం కోసం వెదురు, ఈత, టేకు మొక్కలను రైతులకు ఇచ్చి ప్రోత్సహించాలి*సచివాలయంలో చీఫ్ సెక్రెటరీ ఎస్. కే. జోషి అధ్యక్షతన సమావేశమైన హరితహారం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ.
మరికొద్ది రోజుల్లో హరితహారం నాలుగో దశ ప్రారంభ మౌతున్నందున, ఏర్పాట్లపై సచివాలయంలో చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషీ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. హరితహారంలో పాల్గొనే వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో ఉన్న కమిటీ ఖరారు చేసిన జిల్లాలు, శాఖల వారీ మొక్కలు నాటే లక్ష్యానికి స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ యేడు కూడా నలభై కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకునేలా ఏర్పాట్లు ముమ్మరం చేయాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. వర్షాకాలం సీజన్ లో మొక్కలు నాటి తమ బాధ్యత తీరిపోయిందన్నట్లు ఆయా శాఖలు ప్రవర్తించవద్దని, ఏడాది పొడుగునా ఆ మొక్కల సంరక్షణ చూసే బాధ్యత కూడా ఆ శాఖలే చేపట్టాలని ఆదేశించారు. తగిన రక్షణ చర్యలు ఏర్పాటు చేయటం, నీటి వసతి కల్పించటం, మొక్కల ఎదుగుదల, బతికిన మొక్కల శాతంపై నెలవారీ నివేదికలు పంపాలని, ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు. మెట్ట ప్రాంత రైతులకు అదనపు ఆదాయాన్ని కల్పించేందుకు టిష్యూ కల్చర్ లో భాగంగా వెదురు పంట సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. మధ్య ప్రదేశ్ లో పర్యటించిన అటవీ శాఖ అధికారి ఆర్.ఎం. డోబ్రియల్ నివేదికను సీ.ఎస్ పరిశీలించారు. ఈ యేడాది ఐదు లక్షల వెదురు మొక్కలను రైతులకు సరఫరా చేయాలని, సుమారు వెయ్యి మంది ఔత్సాహిక  రైతులను ఇందుకోసం గుర్తించాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అన్ని యూనివర్సిటీలు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సీ.ఎస్ ఆదేశించారు. వారితో ఒక సమన్వయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త నర్సరీల ఏర్పాటు, మెరుగ్గా మొక్కల సంరక్షణ కోసం ఏర్పాటు చేసి శిక్షణా తరగతులు జులై తొమ్మిది కల్లా మండల స్థాయి వరకు పూర్తి అవుతాయని ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీ.కె.ఝా వెల్లడించారు.సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, సీ.ఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, జీహెచ్ఎంసీ, వ్యవసాయ, ఉద్యానవన, సాగునీటి, ఎక్సయిజ్, రోడ్లు భవనాల శాఖల అధికారులు పాల్గొన్నారు.
print

Post Comment

You May Have Missed