అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సెర్ప్, నరేగా ఉద్యోగుల వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయిం

అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సెర్ప్, నరేగా ఉద్యోగుల వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సెర్ప్ సిఇఓ పౌసమిబసు తదితరులతో క్యాంపు కార్యాలయంలో సిఎం మంగళవారం సమీక్ష జరిపారు. సెర్ప్, నరేగాలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలపై చర్చించారు. వారి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా అన్నారు. సెర్ప్ లో 4,174 మంది ఉద్యోగులుండగా, వారిలో 767 మంది మండల సమాఖ్య క్లస్టర్ కో-ఆర్డినేటర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్లస్టర్ కో-ఆర్డినేటర్ల వేతనం ప్రస్తుతం రూ.6,150 ఉంది. దీన్ని రూ.12,000కు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మిగతా సెర్ప్ ఉద్యోగుల వేతనాలు 30 శాతం మేర పెంచాలని సిఎం ఆదేశించారు. మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పది వేల మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో 6,982 ఫీల్డ్ అసిస్టెంట్లు రూ.6,290 జీతంతో పనిచేస్తున్నారు. వీరి వేతనాన్ని రూ.10,000కు పెంచాలని సిఎం నిర్ణయించారు. నరేగాలోని మిగతా ఉద్యోగుల వేతనాలను 20శాతం మేర పెంచాలని ఆదేశించారు. పెంచిన జీతాలకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని పంచాయితీ రాజ్ శాఖ మంత్రిని ఆదేశించారు.

 

print

Post Comment

You May Have Missed