అతిథిగృహ ప్రాంగణాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలి -ఈ ఓ

 శ్రీశైలదేవస్థానం:క్షేత్ర పర్యటనలో భాగంగా ఈ రోజు  8 న కార్యనిర్వహణాధికారి  పలు అతిథి గృహాలను ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ పర్యటనలో భాగంగా ముందుగా  పాతాళేశ్వర సదన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అతిథిగృహ ప్రాంగణాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలన్నారు. ముఖ్యంగా గదులు ఖాళీ అయినప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే శుభ్రపరుస్తుండాలని కూడా ఆదేశించారు.కో విడ్ నిబంధనల మేరకు అతిథిగృహల గదులను, కారిడార్లు మొదలైనవాటిని శానిటైజేషన్ చేస్తుండాలన్నారు.ప్రతి గదిలో కూడా అవసరమైన మేరకు ఫర్నీచర్ అందుబాటులో ఉండే విధంగా అధికారులు ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. అవసరమైనచోట్ల ఎప్పటికప్పుడు ఫర్నీచర్లకు మరమ్మతులు, పాలిషింగ్ చేయడం మొదలైన పనులను చేపడుతుండాలన్నారు.ప్రతి అతిథిగృహ ప్రాంగణాలు ఆహ్లాదకరంగా ఉండేందుకుగాను పచ్చదనాన్ని మరింతగా పెంపొందించాలని ఉద్యానవన విభాగాన్ని సూచించారు.

కార్యనిర్వహణాధికారి పాతాళగంగమార్గములోని డార్మిటరీలను పరిశీలించారు.డార్మిటరీ ప్రాంగణాలలో కూడా మరింతగా పచ్చదనం పెంపొందించాలని, ముఖ్యంగా అలంకార మొక్కలను (క్రొటన్ మొక్కలు) పెంచాలని సూచించారు. అతిథిగృహాలలో బస చేసే వారు కోరే సాధారణ సమాచారాన్ని అనగా ఆలయ దర్శన వేళలు, ఆర్జిత సేవా వివరాలు, శ్రదర్శనీయ స్థలాలు మొదలైన వాటిని వివరంగా తెలియజెప్పాలని అతిథిగృహాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్  మురళీ బాలకృష్ణ, వసతివిభాగ సహాయ కార్యనిర్వహణాధికారి  డి. మల్లయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( ఐసి)  శ్రీనివాసరెడ్డి, వసతివిభాగం పర్యవేక్షకులు  స్వాములు, రెవెన్యూ విభాగపు పర్యవేక్షకులు  కె. శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

*Ankaalamma special puja performed in the temple today.

*Ch.Varalakshmi donated  Rs. One Lakh for Go samrakshana Nidhi   in memory of Late  Narayana Rao  .DD handed over by S.Sudhakar. 

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.