*Kidambi Sethu raman*
Sri Ahobila math paramparadheena
Srimadaadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam,
Ahobilam.
Swamy Sri Vedaantha Desikan 750th thirunakshatra mahothsavam
Morning sannidhi mangalasasanam
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీమదాదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ స్వామి వేదాంత దేశికుల వారి 750వ తిరునక్షత్ర మహోత్సవం
ఉదయం సన్నిధి మంగళాశాసనం
స్వామి శ్రీ వేదాంత దేశికుల తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా వారి శ్రీ పాదములకు ఒక చిన్న పద పుష్పం
వృషగిరి దేవుని ఘంటావాతారుడే యితడు
దోషములు బాపు స్వామి దేశికుడే సిలకా
ద్విరద శైలము మీద వరదగజమునకు
శరణాగతి గొలుసులను కట్టినాడే సిలకా
తిరువరంగనాథుని మహామణి పాదుకలను
తిరముగా నిలిపిన భరతుడు తానే సిలకా
వివిధ విచారములు చేసి అలసిన వేదసతికి
నవ తాళము నేర్పిన వేదాంతాచార్యుడే సిలకా
లావెక్కిన కాకరి మత మృగముల పాలిటి
కవితార్కిక కంఠీరవుడే మా స్వామి సిలకా
మోడు బారిన దాసుల హృదయ వనమునకు
వేడుక చేసి మురిపించిన వసంతుడే సిలకా
అడవి జీవయాత్రలోన నడవలేని నరులకు
తోడుగ స్తోత్ర దివిటీలిచ్చిన ఘనుడే సిలకా
On this great day of swami sri vedaantha desikan thiru nakshatram….A small pada pushpam to acharya’s sree padam
O my heart!!
He is the incarnation of ghantai of vrushagiri natha(tirumala).He is swami desika who cleans our sins.
He has locked the elephant like varada raja on the hills of hasthi sailam with chains of saranaagathi.
He re established the vaibhavam of maha mani paduka of sri ranganatha so like bharatha.
He is the vedaanthacharya who made veda sathi to learn the new music who was very tired after thinking about different aspects of spirituality.
He is kavitharkika simha who is like a lion to all the false religions.
He is like vasantham who brought happiness to the hearts of dasas that had lost all hopes.
He is the greatest who has given his stotrams as a torch to the people who is unable to walk in the forest like samsara