శ్రీశైల దేవస్థానం: ఈ రోజు 29న జరిగిన శ్రీశైల దేవస్థానం హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.1,41,20,481 /- లు రాబడిగా లభించాయి.
ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 23 రోజులలో సమర్పించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.ఈ ఓ పర్యవేక్షించారు.