అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 80 శాతం హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను తన రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్నానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న గొప్ప నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్పయాత్ర పూర్తయింది.. ఈ రోజు అదే జనవరి 9న చిత్తూరులో జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించడం జిల్లా వాసుల అదృష్టంగా భావిస్తున్నానన్నారు.