సెప్టెంబర్ 08 రోజు పూర్వ ప్రధానమంత్రి పి వి నరసింహారావు శత జయంతి సందర్భంగా చర్చ, ప్రభుత్వ తీర్మానాలు. ( క్వశ్చన్ అవర్ , జీరో అవర్ ఉండదు).
సెప్టెంబర్ 09 తేదీ నుండి ప్రతి రోజూ ఉదయం మొదటి గంట సేపు ప్రశ్నోత్తరాల సమయం (6 ప్రశ్నలకు మాత్రమే అనుమతి).
అరగంట జీరో అవర్.
తదుపరి “టీ”.
తదనంతరం లఘు చర్చ.
సభ జరిగే రోజులలో బిల్లులను ప్రవేశ పెట్టడానికి రెండు లేదా మూడు రోజులు శాసనసభ సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ప్రత్యేకంగా సమావేశం.
ఈరోజు సభ వాయిదా వేసిన అనంతరం శాసనసభ భవనంలోని కమిటీ హాల్-1 లో సమావేశమైన శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC).
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న సభా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సభ్యులు ఈటెల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగడి సునిత, ప్రతిపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఒవైసీ, భట్టి విక్రమార్క, లెజిస్లేటివ్ సెక్రటరీ డా వి నరసింహాచార్యులు.
సభా నాయకుడు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించడానికి అసెంబ్లీ సమావేశాలు ఒక వేదిక. ప్రజా సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివేళలా సిద్దంగా ఉన్నది. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు సభ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. మా తరపున లఘు చర్చకు 16 అంశాలను ప్రతిపాదించాం.
సభలోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా చర్చా సమయాన్నికేటాయించాలని స్పీకర్ ని కోరిన సభా నాయకుడు.
AIMIM పక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ సభా నాయకుడు చేసిన సూచనలను తాము అంగీకరిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తమ పార్టీ తరుపున ప్రతిపాదించే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరగా, సభా నాయకులు కెసిఆర్ అంగీకరించారు.