
శ్రీశైలదేవస్థానం : సిద్ధవటంలో శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నయన మనోహరంగా జరిగింది. శ్రీశైల దక్షిణ ద్వార క్షేత్రమైన కడప జిల్లాలోని జ్యోతిస్సిద్ధవట క్షేత్రంలో దేవస్థానం శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం ఈ రోజు (01.03.2021) న ఘనంగా నిర్వహించింది.శ్రీశైల దేవస్థాన అనుబంధ దేవాలయమైన జ్యోతిస్సిద్ధవటం లో ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కంటే ముందుగా కల్యాణోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది.ఈ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు సిద్ధవటక్షేత్ర అధిదేవులైన శ్రీ జ్యోతిస్సిద్ధేశ్వరస్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ కామాక్షీదేవి అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, రుద్రహోమంజరిపారు \. ఈ సాయంత్రం శ్రీ స్వామిఅమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వేదపండితులు ఆగమశాస్త్రాన్ని అనుసరించి సంప్రదాయ బద్దంగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ కల్యాణోత్సవ సంకల్పం, అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా, శుభప్రదంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించి తరువాత పుణ్యాహవచనాన్నిచేసారు.అనంతరం కంకణపూజ కార్యక్రమాన్ని జరిపి శ్రీ స్వామివారికి కంకణధారణ చేసారు. ఆ తరువాత యజ్ఞోపవీత పూజ జరిపి శ్రీ స్వామివారికి యజ్ఞోపవీతధారణ కార్యక్రమం జరిపారు.
శ్రీస్వామివారి యజ్ఞోపవీత ధారణ అనంతరం కన్యావరణం కార్యక్రమం, గౌరీపూజ, అమ్మవారి కంకణధారణ కార్యక్రమాలు జరిపారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్ల ప్రవర అనంతరం స్వామివారికి వరపూజ నిర్వహించి శ్రీ స్వామి అమ్మవార్లకు బాషికాలను అలంకరించారు.తరువాత ఈ భూమండలం, శ్రీశైలక్షేత్రవర్ణనతో కూడిన మహాసంకల్పం పఠించి అనంతర పూజ చేసారు.మహాసంకల్ప పఠన తరువాత అర్చకులు, వేదపండితులు మంగళాష్టకాలను పఠిస్తూ సుముహూర్త సమయంలో శ్రీ స్వామి అమ్మవార్ల శిరస్సులపై జిలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సమర్పించారు.అనంతరం లోక కల్యాణం కోసం అమ్మవారికి మాంగల్యధారణ జరిపి అనంతరం తలంబ్రాలను శ్రీ స్వామి అమ్మవార్లకు సమర్పించారు.
శ్రీ స్వామి అమ్మవార్ల వస్త్రాల కొంగులను కలుపుతూ బ్రహ్మముడి వేసారు. చివరగా శ్రీ స్వామిఅమ్మవార్లకు పున:పూజలు జరిపి ఆశీర్వచనం, భక్తులకు ప్రసాద వితరణ చేసారు. భక్తులు తిలకించి తరించారు.
* B.Chinnaiah, Nellore donated Rs.One Lakh For Annadhaanam scheme.
* G. Dhanunjayarao, Guduru, Nellore District donated Rs. One Lakh For Annadhaanam scheme.
*Sahasra Deeparchana seva performed in the temple by Archaka swaamulu.