సంక్షేమ రంగంలో మిషన్ భగీరథ అద్భుత పథకమన్నారు యునైటెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ బజాజ్. తెలంగాణ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారు చేస్తున్న బృహత్ ప్రయత్నానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. పంచాయితీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ ను కలిసిన పవన్ బజాజ్, మిషన్ భగీరథకు 1350 కోట్ల రూపాయల రుణసహాయం ఇవ్వడానికి అంగీకరించారు. దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు మిషన్ భగీరథకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుక రావడం శుభపరిణామని ఎస్పీ సింగ్ తెలిపారు. నాబార్డ్, హడ్కో తో పాటు 13 వాణిజ్య బ్యాంకులతో ఇప్పటివరకు 28,938 కోట్ల రూపాయల విలువైన పనులకు రుణ ఒప్పందం కుదిరిందని, అందులో 22959 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ అయితే, మిగిలిన 5979 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ అన్నారు. ఈ రుణాలకు సంబంధించిన చెల్లింపులను బ్యాంకులు దశల వారీగా చేస్తున్నాయన్నారు. మిగిలిన 9632 ఆర్థిక సహాయానికి నాబార్డ్, మరో 5 బ్యాంకులతో సూత్రప్రాయంగా అంగీకరించాయని, త్వరలోనే ఒప్పందం కూడా చేసుకుంటామన్నారు ఎస్పీ సింగ్.
వేగంగా బిల్లుల చెల్లింపులు
మిషన్ భగీరథకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు RWS&S ఈ.ఎన్.సి బి.సురేందర్ రెడ్డి. సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వర్క్ ఏజెన్సీలకు బిల్లులను వేగంగా నెలలో రెండుసార్లు అంటే ప్రతీ నెల 5 వ తారీఖు, 20 వ తారీఖున చెల్లిస్తున్నామన్నారు. ఒక ప్రభుత్వ పథకంలో ఇంత స్పీడ్ గా బిల్లులు చెల్లించడం ఇంతవరకు ఎక్కడా జరగలేదన్నారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం కాకుండా భగీరథ బ్యాంకు ఖాతాలో ఎప్పుడు 3 వేల కోట్ల రూపాయల నిధిని మేయిన్ టైన్ చేస్తున్నామన్నారు. ఫలితంగా ఇప్పటిదాక 5950 కోట్ల విలువైన పనులకు చెల్లింపులు జరిపామన్నారు. భగీరథ పనులు జరుగుతున్న స్పీడ్ ను చూసి ఇతర రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులే ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. బిల్లుల చెల్లింపులో ఏ వర్క్ ఏజెన్సీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ పేయిడ్ ప్రకారం బిల్లులు ముందు దాఖలు చేసిన వారికి ముందుగా చెల్లిస్తున్నామన్నారు.
ప్రతీ మూడు నెలకు యాక్షన్ ప్లాన్
మిషన్ భగీరథను ముందుగాల నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకున్నామని, కాని తెలంగాణ ప్రజలకు త్వరగా సురక్షిత మంచినీటిని అందించాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి చెప్పారు. అందుకే 2018 డిసెంబర్ టార్గెట్ గా భగీరథ పనులు జెట్ స్పీడ్ తో జరుగుతన్నాయన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి యాక్షన్ ప్లాన్ ను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా పనులు చేయిస్తున్నామన్నారు. పక్కా ప్రణాళికతో పనులు జరుగుతున్నందునే 19 ఇంటెక్ వెల్స్ అన్నీ సేఫ్ స్టేజ్ కు వచ్చాయని తెలిపారు. ఫలితంగా మొన్నటి భారీ వర్షాలకు కూడా పనులకు అంతరాయం కలగలేదన్నారు. అటు 19 ఇంటెక్ వెల్స్ లో ఏడింటి నిర్మాణం వేగంగా పూర్తయిందని, మరో 9 ఫ్లోర్ స్లాబ్ లెవల్స్ కు వచ్చాయన్నారు.మూడు ఇంటెక్ వెల్స్ సైడ్ వాల్స్ పూర్తయ్యే దశలో ఉన్నాయి. డిసెంబర్ 2016 నాటికి అన్ని ఇంటెక్ వెల్స్ నిర్మాణం పూర్తవుతాయన్నారు. ఇంటెక్ వెల్స్ కు అనుగుణంగా WTP , OHBR, పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కొత్తగా కట్టాల్సిన 50 WTP ల్లో ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి నీటిని సరాఫరా చేయాల్సిన ఆవాసాలకు సంబంధించిన 15 ప్లాంట్ల నిర్మాణ పనులు [ CIVIL WORKS ] , సబ్ స్టేషన్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందన్నారు.ఎలక్ట్రో, మెకానికల్ తో పాటు చిన్నచిన్న పనులు అతి త్వరలో పూర్తి అవుతాయన్నారు. మార్చ్ 2017 టార్గెట్ నాటికి 20, జూన్ 2017 నాటికి 13, అగష్టు 2017 నాటికి 2 ట్రీట్ మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు. వీటితో పాటే పైప్ లైన్ పనులను కూడా వేగంగా చేస్తున్నామని ఈ.ఎన్.సి చెప్పారు. ఈ సంవత్సరం డిసెంబర్ కు నీళ్లిచ్చే ఆవాసాలకు వేసే 10,260 కిలోమీటర్ల పైప్ లైన్ లో దాదాపు 7700 కిలోమీటర్లు పూర్తైందన్నారు. మిగిలిన పైప్ లైన్ పనులు కూడా త్వరగానే పూర్తవుతాయన్నారు. పైప్ లైన్ తో పాటే ఆప్టిక్ ఫైబర్ కేబుల్ డక్ట్ ను కూడా వేస్తున్నామన్నారు. డిసెంబర్ 2016 కు నీళ్లిచే ఆవాసాలకు సంబందించిన 99 సంపుల్లో 45 , 94 OHBR లలో 46 నిర్మాణం పూర్తైందని చెప్పారు. టార్గెట్ డేట్ కు అనుగుణంగా మిగిలిని వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మిషన్ భగీరథను సకాలంలో పూర్తి చేయడానికి భగీరథ ఇంజనీర్లు పగలు,రాత్రి కష్టపడుతున్నారని ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి చెప్పారు.