శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు వివిధ అంశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి . వద్దిపర్తి పద్మాకర్ ప్రవచనం చేసారు . కర్నూలు కు చెందిన శ్రీమతి సీ హెచ్ . హరిప్రియ గాత్ర కచేరి అలరించింది . రంగారెడ్డి కి చెందిన పేరిణి శ్రీనివాస రావు బృందం అద్భుత పేరిణి నృత్య ప్రదర్శన సమర్పించారు . వివిధ రూపాల్లో కళావిన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి .