కరీంనగర్: శ్రీరాంసాగర్ కాలువకు మల్యాల మండలం మానాల వద్ద మూడు రోజుల క్రితం పడిన గండి నిర్మాణ పనులను మంత్రి హరీష్ రావు శనివారం సాయంత్రం పరిశీలించారు. గండి పడడంతో ఏర్పడిన పరిస్థితిని, ప్రజల ఇబ్బందులు ఎమ్మెల్యే శోభను అడిగి తెలుసుకున్నారు. గండి పూడ్చే నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను హరీష్ రావు ఆదేశించారు.. ఆదివారం రెండువేల క్యూసెక్కుల నీటిని, సోమవారం అదనంగా మరో రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సాగునీీరులేక రైతాంగం ఇబ్బందులు ఎదుర్కుంటున్న పరిస్థితి నుంచి వరుణదేేవుడు గట్టెక్కించాడన్నారు..వర్షం మూలంగా తలెత్తుతున్న పరిస్థితులను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదురుర్కుంటుందన్నారు.మానాలమ్యాడంపల్లి ,గాగరరమాల ప్రజలుఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.