ఈనెల 29న మరోసారి సమావేశం కావాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం .
శనివారం సచివాలయంలో జరిగిన తొలి సమావేశానికి మంత్రి హరీశ్ రావు అధ్యక్షత వహించారు. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు ఆర్ . విద్యాసాగరరావు ,ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, ఇ.ఎన్.సి. మురళీధర్ రావు,సీనియర్ న్యాయవాది రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపరంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశంపై రెండు గంటలకు పైగా చర్చించారు.
<
>