మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని చిలకలపూడి సి.ఐ .దుర్గ ప్రసాద్ ,హెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర అధ్యక్షులు మరీదు.శివరామకృష్ణ ప్రారంభించారు. సి.ఐ మాట్లాడుతూ వేసవికాలం లో మజ్జిగ పంపిణీ అభినందనీయమని అన్నారు . హెల్పింగ్ హ్యాండ్స్ శ్రేయోభిలాషి విఠల్ సాయి(మచిలీపట్టణం) పుట్టినరోజు న తన వంతు సాయం అందించారు . హెల్పింగ్ హ్యాండ్స్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షులు నాగూర్ ,న్యాయవాది చలపాటి.రాజేష్ ,మచిలీపట్టణం టీం సునీల్,శశి,మధు ,ప్రవీణ్,రంగబాబు ,కూనపురెడ్డి.విజయ్ తదితరులు పాల్గొన్నారు .-