వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదివారం పరామర్శించారు. ఇటీవలే రమేష్ తల్లి, స్వాతంత్ర్య సమరయోధురాలు లలిత మరణించిన నేపథ్యంలో హైదరాబాద్ లోని రమేష్ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. రమేష్ కు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిఎం వెంట మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, జోగు రామన్న, ఎంపి మల్లారెడ్డి తదితరులున్నారు.