వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీ హ్రితికేష్ ఆధ్వర్యములో చాంబర్ అఫ్ కామర్స్ లో పరిశ్రమల శాక మొదలు పెట్టిన ఆన్ లైన్ సేవల గురించి జాయింట్ డైరెక్టర్ శ్రీ సంగ సురేష్ గారు మరియు అసిస్టెంట్ డైరెక్టర్ కే చంద్ర శేకర్ బాబు గారు హైదరాబాద్ వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలోని నూతన పారిశ్రామిక వేత్తలకి పరిశ్రమ వర్గ సబ్యులకి రైస్ మిల్ / స్పిన్నింగ్ మిల్స్ / గ్రానైట్ అసోసియేషన్ వాళ్ళకి వివరించారు .. తెలంగాణ పరిశ్రమల షాక మొదలు పెట్టిన టి.స్.ఐ.పా.స్ ఆన్ లైన్ సేవలు ప్రజలందరికి చాల ఉపయోగకరమని మరియు ముక్యముగా కొత్తగా పరిశ్రమ స్థాపించాలని అనుకొనే వారికీ చాల సమయం వృధా కాకుండా మల్లి అన్ని రకాల పర్మిషన్స్ కి అందరి చుట్టూ వివిధ రకాల ప్రబుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా .. ఇంట్లో కుర్చుని ఆన్ లైన్ లో టి.స్.ఐ.పా.స్ (ipass.telangana.gov.in) వెబ్ సైట్ లో సమాచారం పొందు పరిస్తే అన్ని రకాల అప్ప్రోవల్స్ వస్తాయి అని.. ఎలా అప్లికేషను సమాచారం నింపాలి అని అందరికి ట్రైనింగ్ ఇచారు. మరియు ఇన్సెంటివ్ అప్లికేషను రా మేటి రియల్ అప్లికేషను ఎలా చేసుకోవాలి అని క్లుప్తముగా వివరించారు.. తరువాత కమిషనర్ / డైరెక్టర్ శ్రీ. మానికా రాజ్ గారు పారిశ్రామిక వేత్తల సమస్యలని తెలుసుకొన్నారు, మరియు వారికీ సలహాలని సుచాలని అందించారు … ఇలా ఇంతకముందు రంగారెడ్డి జిల్లా లో కూడా మెదక్ మరియు రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ వాళ్ళతో, కరీంనగర్ జిల్లలో ఆదిలాబాద్, మరియు నిజామాబాదు జిల్లా అసోసియేషన్ వాళ్ళతో జాయింట్ డైరెక్టర్ సంగ సురేష్ గారు వర్క్ షాప్ ట్రైనింగ్ మీటింగ్ లు కండక్ట్ చేసారు.. మీటింగ్ అనంతరం డైరెక్టర్ శ్రీ. మానికా రాజ్ గారినీ పారిశ్రామిక వేత్తలు సన్మానించారు.. డైరెక్టర్ గారు చేస్తున్న పరిశ్రమల అబివృద్ది పనులకి వారికీ కృతజ్ఞతలు మరియు అబినందనలు తెలియచేసారు .. అనంతరం జాయింట్ డైరెక్టర్ శ్రీ. సంగ సురేష్ గారిని సన్మానించడం జరిగింది. జిల్లా పరిశ్రమల కేంద్రం నుండి జనరల్ మేనేజర్ శ్రీ హృతికేష్ గారు డిప్యూటీ డైరెక్టర్ సల్మాన్ రాజు గారు, అసిస్టెంట్ డైరెక్టర్ వీరేశం గారు మరియు FSS (Frux Software Solutions) నుండి శ్రీ అభిలాష్ CGG (Center for Good Governance) నుండి శ్రీ మారం ప్రశాంత్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు