సోమవారం శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం సందర్భంగా దేవస్థానం వారు దాదాపు అన్ని ఏర్పాట్లు చేసారు .
ఆదివారం సాయంత్రం మిధిలా ప్రాంగణం లో ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. అటు శ్రీరాముని గుణగణాలనూ ఇటు అమ్మవారి సౌశీల్య సంపదనూ వేదపండితులూ అర్చకస్వాములూ వరుని వైపు వధువు వైపు రెండు బృందాలై వర్ణించారు. వేలమంది ఈ వేడుకను తిలకించి పులకించారు. అత్యంత వైభవంగా ఎదుర్కోలు వేడుక జరిగింది.
ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు . వేలమంది భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వసతికి విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటుచేశారు.
అంబసత్రం,కరివేనసత్రం,రెడ్డిసత్రం,అహోబిలమఠం,శ్రీజీయర్ మఠంలలో వేలమందిికి వసతి భోజనాల ఏర్పాట్లు జరిగాయి.వికాసతరంగిణి ,Lions Club. రోటరీ,అవోపా, వంటి సంస్థలు వివిధ కూడళ్లలో సేవా శిబిరాలు నిర్వహిస్తున్నాయి .
మొత్తంమీద రాములోరి పెళ్లికి భద్రాద్రి సర్వాంగసుందరంగా సిద్ధమైంది.
*దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , ఎంపీ సీతారాం, కేటీఆర్ కొడుకు హిమాంశు భద్రాచలం చేరుకున్నారు .
Post Comment