యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశం

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, వాటి ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్.కె. జోషితో మాట్లాడారు. గత 15 రోజులుగా వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి, నివేదికలు వెంటనే పంపించాలని సీఎం ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్.కె. జోషి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి పంపాలని ఆదేశించారు. అధికార బృందాలు తక్షణం గ్రామాల్లో పర్యటించాలని చెప్పారు.

print

Post Comment

You May Have Missed