మిస్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్ చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయుడు టైటిల్ సాధించాడు
ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన మిస్టర్ వరల్డ్ ఫైనల్స్‌లో 46 మంది అభ్యర్థులతో పోటీపడి హైదరాబాద్‌కు చెందిన రోహిత్ ఖండేల్వాల్ (26) 2016 మిస్టర్ వరల్డ్‌గా ఎంపికయ్యాడు. బహుమతి కింద రూ.35లక్షల నగదు.
రోహిత్ మాట్లాడుతూ ప్రపంచ టైటిల్ దక్కిందంటే నమ్మలేకపోతున్నాను. భారతీయుల అభిమానమే గెలిపించింది. ఈ టైటిల్ సాధించిన మొదటి భారతీయుడిని కావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నది. నా కల సాకారమైంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి సహకరించిన, మార్గదర్శకం చేసిన మిస్ ఇండియా సంస్థకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
26ఏళ్ల రోహిత్ ప్రముఖ బుల్లితెర నటుడు, మోడల్‌గా సుపరిచితుడు. బాలీవుడ్ నటి కరీనాకపూర్‌తో కలిసి ఓ యాడ్‌లో నటించిన రోహిత్.. తర్వాత పలు హిందీ సీరియల్స్‌లో నటించాడు. 2015లో మిస్టర్ ఇండియాగా ఎంపికయ్యాడు. మిస్టర్ వరల్డ్‌గా ఓ భారతీయుడు ఎంపికవడం ఇదే తొలిసారి.