బహుజనులకు రాజ్యాధికారం తోనే సత్ఫలితాలు

*Mouli,Machilipatnam*

బహుజనులకు రాజ్యాధికారం తోనే ఎస్సి,ఎస్టీ,బిసి,మైనారిటీల అభివృద్ధి సాధ్యపడుతుంది అని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పట్టపు రవి అన్నారు.కృష్ణా జిల్లా బిఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రమైన మచిలీపట్నం లో  శుక్రవారం నిర్వహించిన క్రైస్తవ,ముస్లిం మైనారిటీ,  బిసిల చైతన్య సదస్సులో  ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ పోలీస్ ఐ.జీ రవి మాట్లాడుతూ రాష్ట్రంలో బిసిలు,మైనారిటీల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు.
రిజర్వేషన్లు అమలులో మైనారిటీల కు,బిసిలకు సరైన న్యాయం జరగటంలేదన్నారు.
ముస్లింలకు 10 శాతం,బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.దళిత క్రైస్తవులను ఎస్సిలుగా పరిగణించాలని అన్నారు.బీఎస్పీ చీఫ్ జోనల్ కోఆర్డినేటర్ లు బర్రె ఆనంద్ కుమార్,జె.ఆర్.మల్లికల్  చేసిన ప్రసంగాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కొడమల ప్రభుదాస్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బిఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.పుష్పరాజ్, ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇంచార్జ్  డాక్టర్ లంకా కరుణాకర్ దాస్,రాష్ట్ర కార్యదర్సులు,మచిలీపట్నం నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షుడు కుంపటి జయాకర్ బాబు,ప్రధాన కార్యదర్శి గడ్డంరాజు, బిసి సెల్ ప్రెసిడెంట్ వేముల పాపారావు,పట్టణ పార్టీ అధ్యక్షుడు జుజ్జువరపు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.అనంతరం ర్యాలీ గా జిల్లా కాలెక్టరేట్ వరకువెళ్లి జాయింట్ కలెక్టర్ విజయా కృష్ణన్ కు మెమోరాండం సమర్పించారు.

print

Post Comment

You May Have Missed