ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్బంగా రుమటోలోజి అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్ లెస్ రోడ్ జలవిహార్ లో చేపట్టిన వాక్ టు సప్పోర్ట్ ఆర్థరైటిస్ అవేర్నెస్ నడకను ప్రారంభించిన వైద్య మంత్రి డాక్టర్ సీ లక్ష్మా రెడ్డి
అవగాహన తోనే అనేక సమస్యలకు పరిష్కారం. అనేక ఆరోగ్య సమస్యలకు మూలం అవగాహన రాహిత్యమే అవగాహన, తగిన చైతన్యం వుంటే అనేక ఆరోగ్య సమస్యలను కూడా అధిగమించవచ్చు వైద్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, రోగాలను ప్రాధమిక దశలోనే గుర్తించడం, వెంటనే చికిత్స ప్రారంభించడం, తప్పనిసరయితే శస్త్ర చికిత్స చేయించుకోవడం అనే దశలుఁ ఉంటాయి.
సమాజంలో మిగతా జబ్బుల్లాగే, మోకాళ్ళ నొప్పులు దిన దినాభివృద్ధి చెందుతున్నాయి కాన్సర్ లాంటి జబ్బులు ముదురుతున్నాయి కొద్దిపాటి జాగ్రత్తలు రోగుల ప్రాణాలను కాపాడవచ్చు జబ్బుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ప్రభుత్వం పరంగా ప్రోత్సహిస్తున్నాం ప్రభుత్వం కూడా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది ఈ మధ్య డెంగీ, మలేరియా వంటి విష జ్వరాల నివారణ మీద ఏజెన్సీ ప్రాంతాల్లో సాంస్కృతిక రథ సారథి ఆధ్వర్యంలో చేసిన ప్రచారం మంచి ఫలితాలు ఇచ్చింది ప్రభుత్వ వైద్యాన్ని మరింత అభివృద్ధి పరుస్తున్నాం ప్రజలకు సర్కార్ వైద్యాన్ని చేరువ చేస్తున్నాం ఆధునిక సదుపాయల్తో పాటు డాక్టర్లు, సిబ్బంది ని నియమిస్తున్నాం ఆర్థరైటిస్ రంగంలో మరింత మంది వైద్యుల నియామకం చేపడతాం.
ఈ కార్యక్రమంలో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బంది, డాక్టర్లు, పీజీ స్టూడెంట్స్, ప్రజలు పాల్గొన్నారు