*బీవీ ,హైదరాబాద్*
ఎల్ బి నగర్ లో బుధవారం జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు , మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. దళిత బహుజనులపై ముఖ్యమంత్రి కపట ప్రేమ చూపిస్తున్నారని వెంకటరెడ్డి ఆరోపించారు .ముఖ్యమంత్రి పేపర్ ప్రకటనలకే శాశ్వతం అయ్యారన్నారు .ఫీజు రియంబర్స్మెంట్ బకాయి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.