*మీ చేతిలో పెరిగిన బిడ్డను: సీఎం కేసీఆర్*
‘నేను మీరు పెంచిన బిడ్డను, మీ చేతుల మీదుగా పెరిగాను’ అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘మీ దీవెనల వల్లే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొచ్చానని’ తెలిపారు. ఇవాళ సిద్దిపేట జిల్లా ఏర్పాటైన సందర్బంగా ఆయన రోడ్‌షోలో మాట్లాడారు. తాను సిద్దిపేటలో తిరగని గ్రామంలేదని, తిరగని గల్లిలేదని వివరించారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనని తెలిపారు. మీరు తెలంగాణ కోసం పంపించారు. ‘నేను తెలంగాణ సాధించుకొచ్చానని’ తెలిపారు. ఈ ఘనత సిద్దిపేట ప్రజలకు దక్కుతుందన్నారు. మీరిచ్చిన ప్రోత్సాహం తోనే తెలంగాణ సాధించుకున్నాం. నా చేతుల మీదుగా తెలంగాణ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
బతికున్నంతం వరకు మీ కోసం పనిచేస్తా, మీరు దీవిస్తూ ఉండండి, మీ కోసం పనిచేస్తూ పోతా. నేను రాజీనామా చేసి పోయేటపుడు కళ్లల నీల్లు వచ్చినయి. సిద్దిపేటకు ఎలా అని బాధపడ్డాను. కానీ యువకుడు హరీష్ చేతిలో సిద్దిపేట అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే సంవత్సరం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు.