తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసి కమిషన్ ను నియమించింది. బిసి కమిషన్ నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శనివారం సంతకం చేశారు. ప్రముఖ సామాజికవేత్త, రచయిత బిఎస్. రాములు అధ్యక్షుడిగా వ్యవహరించే కమిటీలో జాతీయ బిసి కమిషన్ సభ్యుడిగా పనిచేసిన వకుళాభరణం కృష్ణమోహన్, డా.ఆంజనేయగౌడ్, ప్రముఖ రచయిత జూలూరి గౌరి శంకర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ పదవీ కాలన్ని మూడేళ్లుగా నిర్ణయించారు.
నూతనంగా నియమింపబడిన బిసి కమిషన్ అధ్యక్షులు, సభ్యులు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
<
>