
తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, మహిళా అధికారులతో కలిసి కేక్ కట్ చేసి.. ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.