రంజాన్ పర్వదినోత్సావాన్ని పురస్కరించుకుని ఐదు వేల మందికి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి తోఫా రూపంలో పండుగ కానుక ప్రకటించారు. డ్రై ఫ్రూట్స్ తో సహా పది రకాల సరుకులు స్వయంగా మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు. శనివారం ఉదయం సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని రాయినిగూడెం వద్ద ఈ కార్యక్రమం ప్రారంభమైంది.