దయాల్బాగు రాధాస్వామి సత్సంగ్ (ఆగ్రా) వారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో డిసెంబర్ 3వ తేదీన ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తారు. ఈ శిబిరంలో హైదరాబాద్, విజయవాడ, కర్నూలు ప్రాంతాలకు చెందిన అత్యంత నిపుణులైన అల్లోపతి (ఇంగ్లీష్), హోమియోపతి వైద్యులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు., వ్యాధి నిర్దారణ పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా అందిస్తారు . కంటి డాక్టర్లు, పంటి డాక్టర్లు, గైనిక్ స్పెషలిస్టులు, జనరల్ ఫిజీషియన్లు, చిన్న పిల్లల వైద్య నిపుణులు సేవాభావంతో వైద్య సేవలు అందిస్తారని శిబిర నిర్వాహకులు డాక్టర్ కె.భాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మెగా వైద్య శిబిరానికి వచ్చే ప్రజలకు అవసరమైతే షుగర్, మల, మూత్ర, రక్త పరీక్షలు, ఎక్స్ రే, ఈసీజీ వంటి పరీక్షలు కూడా అక్కడే చేసి వైద్య నిర్ధారణ చేసేలా ల్యాబొరేటరీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందన్నారు . కోటేకల్లు గ్రామ ప్రజలే కాకుండా.. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కె.భాస్కర్ రెడ్డి విజ్ఘప్తి చేశారు.