నిజామాబాద్ జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావును కోరారు. కలెక్టరేట్ ప్రగతి భవన్ లో జరిగిన మైనార్టీ సంక్షేమ శాఖ సమీక్ష సమావేశం లో ఎంపి కవితతో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొన్నారు. ఉర్దూ జర్నలిస్టుల కుటుంబ సభ్యుల సీఎం ఆర్ ఎఫ్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ దృష్టికి తీసుకు వెళ్లారు. వీలయినంత త్వరగా నిధులు విడుదలయ్యేలా చూడాలని ఎంపి కవిత కోరారు.