గర్భిణులకు , చిన్నారులకు పోషక ఆహార వితరణ చేసిన శ్రీశైలం దేవస్థానం

సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం బుధవారం గర్భిణులకు , చిన్నారులకు పోషక ఆహార వితరణ చేసింది .స్థానిక అంగన్వాడి కేంద్రాలకు ఈ ఆహార పదార్థాలను అందించింది .పది శాతం కన్నా తక్కువగా రక్తహీనత  ఉన్న గర్భిణులకు, అతి తీవ్ర పోషకాహార లోపం ఉన్న ఐదేళ్ళ లోపు చిన్నారులకు ఈ పదార్థాలు అందిస్తారు . ఈ కార్యక్రమాన్ని సమీకృత శిశు సంక్షేమ సేవల ప్రాజెక్ట్ ద్వారా అందిస్తున్నారు . ఈ నెలకు సరిపడ శనగలు అందించారు .ఒక్కో నెల ఒక్కో తీరు పోషకాహార శనగలు ,అలసందలు ,శనగ విత్తనాలు ,బెల్లం వంటి పలు పోషకాహార పదార్థాలు అందిస్తారు . ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు ఎస్వీ కృష్ణా రెడ్డి , సహాయ కార్యనిర్వహణాధికారి కె.శివప్రసాద్ ,సీనియర్ అసిస్టెంట్ లావణ్య , ఐసీడీఎస్ వారు పాల్గొన్నారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.