సిరీస్ ఎ ఫండింగ్ ద్వారా 5 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు -విజిల్ డ్రైవ్
* www.whistledrive.com , 8499040404 *
సిరీస్ ఎ ఫండింగ్ ద్వారా 5 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులను తమ సంస్థ సాధించినట్లు హైదరాబాద్ కు చెందిన రవాణా సాంకేతిక సంస్థ విజిల్ డ్రైవ్ సీఈవో రాకేష్ మున్ననూరు తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు క్యాబ్స్, సురక్షిత సాఫ్ట్ వేర్ తమ సంస్థ అందిస్తుందని చెప్పారు . కారు యజమానులకు తాత్కాలిక డ్రైవర్లను అందించడమే తమ సంస్థ విజిల్ డ్రైవ్ ప్రత్యేకతని రాకేష్ మున్ననూర్ తెలిపారు .కారు యజమానులు తమకు డ్రైవర్ ఒక గంట అవసరం ఉన్నా , లేదా రోజంతా అవసరమున్న తాము నిమిషాల్లో డ్రైవర్లను అందిస్తామని తెలిపారు. మొదటి రెండు గంటలకు రెండువందల రూపాయలు , ఆ తరువాత ప్రతిగంటకు 75 రూపాయలు , 8 గంటల తరువాత ప్రతిగంటకు 50 రూపాయల చార్జి కారు యజమానులు చెల్లించాల్సి ఉంటుందని రాకేష్ తెలిపారు.
సిటీలో షాపింగ్ చేసే వారికి, వివిధ జిల్లాల నుంచి నగరానికి సెల్ఫ్ డ్రైవింగ్ తో వచ్చే కారు యజమానులు సిటీ ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్నారని, అలాంటివారికి , సిటీ నుంచి అవుట్ స్టేషన్ కు వెళ్లే కారు యజమానులకు తాత్కాలిక డ్రైవర్లు చాలా ఉపయోగ పడుతారని రాకేష్ తెలిపారు. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల భద్రతకు తాము రూపొందించిన యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు . ఇంటి నుంచి కంపెనీకి, కంపెనీ నుంచి ఇంటికి ఉద్యోగులను చేరవేసే సంస్థలు ఎన్నో ఉన్నప్పటికీ, ఉద్యోగి ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు ఆఫీస్ కు చేరుకుంటారు, ఎప్పుడు ఇంటికి చేరుకుంటారు తెలిపే సాంకేతిక పరిజ్ఞానం తమ సంస్థ రూపొందించిందని ఇదే విజిల్ డ్రైవ్ ప్రత్యేకతని రాకేష్ తెలిపారు. హైదరాబాద్‌లో మా సంస్థ క్యాబ్స్ ద్వారా ప్రతిరోజు 2,600 మంది ఉద్యోగులను చేర వేస్తున్నామని , అలాగే 75 నుంచి 125 మంది తాత్కాలిక డ్రైవర్లను యజమానులకు ప్రతిరోజు అందిస్తున్నామని, ఐదువేల మంది కారు యజమానులు తమ సంస్థ కస్టమర్లుగా ఉన్నారని ఆయన తెలిపారు. మా విజిల్ డ్రైవ్ మొబైల్ యాప్ ద్వారా లేదా మా వెబ్సైట్ www.whistledrive.com లేదా 8499040404 మొబైల్ నంబర్‌కు కాల్ చేసి డ్రైవర్‌ను బుక్ చేసుకోవచ్చని రాకేష్ మున్ననూర్ తెలిపారు.
చికాగోకు చెందిన కొలోనియం గ్రూప్ అనే పెట్టుబడి సంస్థ తమ సంస్థకు సహాయ సహకారాలు అందిస్తుందని, తమ సంస్థ రెండు కోట్ల 40 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతుందని రాకేష్ తెలిపారు. తమ సంస్థ కు టీ హబ్ లో చోటు లభించిందని రాకేష్ సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో విజిల్ డ్రైవ్ వైస్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, డైరెక్టర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment