ఓ చారిత్రాత్మకమైన బిల్లును తీసుకువచ్చాం-ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

అమరావతి: పారదర్శకతకు ఆంధ్రప్రదేశ్‌ వేదిక కానుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు . అవినీతిని నిర్మూలించేందుకు, పనుల్లో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం రూపొందించిన జ్యూడిషియల్‌ కమిషన్‌ బిల్లుపై ముఖ్యమంత్రి సభలో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..ఈ రోజు ఓ చారిత్రాత్మకమైన బిల్లును తీసుకువచ్చాం. దేశ చరిత్రలో ఎక్కడ జరుగలేదు. ఏపీ నుంచి ఇది మొదలవుతుంది. పారదర్శకత అన్న పదానికి అర్థం ఇక్కడి నుంచి మొదలైతే దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. దేశంలో ఎప్పుడు జరగని విధంగా అవినీతిని తీసివేయాలని, వ్యవస్థలోకి పారదర్శకతను తీసుకురావాలని అడుగులు వేస్తున్నాం. చాలా సార్లు అవినీతికి వ్యతిరేకంగా నాయకులు మాట్లాడారు. నిజంగా ఏం చేస్తే అవినీతి లేకుండా చేస్తామన్నది ఎప్పుడు జరుగలేదు. నిజంగా పారదర్శకత అన్నదానికి అర్థం తెచ్చేందుకు ఈ బిల్లు తెచ్చాం.

గత ఐదేళ్ల చంద్రబాబు పాలన గమనిస్తే..మనం కూర్చున్న ఈ బిల్డింగ్‌ గమనిస్తే స్కామ్‌ కనిపిస్తుంది. టెంపరరీ బిల్డింగ్‌ అడుగుకు రూ.10 వేలు కట్టడానికే ఖర్చు అయిన పరిస్థితి చూశాం. ఏదీ తీసుకున్నా కూడా స్కామ్‌లమయమే. ఇలాంటి పరిస్థితి పూర్తిగా మారాలంటే ఈ బిల్లు ఏ రకంగా ఉపయోగపడుతుందన్నది నాకంటే ముందు మాట్లాడిన వారు చెప్పారు.

ఈ బిల్లు ద్వారా ప్రతి టెండర్‌ రూ.100 కోట్లు, ఆ పైన ఉన్న పనులను ఒక న్యాయమూర్తి వద్దకు పంపిస్తాం. హైకోర్టు చీఫ్‌జస్టీస్‌  నియమించిన జడ్జి ఒక్కసారి బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రభుత్వం పిలిచే ఏ టెండర్‌ అయినా సరే ఆ జడ్జి వద్దకు పంపిస్తాం.  ఆ టెండర్‌ డాక్యుమెంట్‌ పబ్లిక్‌ డొమైన్‌లో వారం రోజుల పాటు ఉంటుంది . ఆ టెండర్లలో ఈ క్లాస్‌ బాగోలేదు..ఇది మార్పు చేయాలని ఎవరైనా సలహా ఇవ్వవచ్చు. జడ్జికే సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ఆ జడ్జి వద్ద టెక్నికల్‌గా తోడుగా ఉండేందుకు ఎవరైనా పిలుచుకోవచ్చు.

జడ్జి వీళ్లు ఎవరూ వద్దు, ఫలాని వారు కావాలని కోరితే వారిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. జడ్జి టెండర్‌కు సంబంధించిన సలహాలు తన వద్ద ఉన్న టెక్నికల్‌ టీమ్‌తో డిస్కర్షన్‌ చేసుకుంటారు. ఆ తరువాత జడ్జి ఆ డిపార్టుమెంట్‌ను పిలిచి తాను ఏదైతే కరెక్టు అని తాను అనుకుంటారో..ఆయన సూచిస్తూ మార్పులు చేస్తారు. అదే మార్పులు తూచా తప్పకుండా చేసిన తరువాతే టెండర్‌ డాక్యుమెంట్‌ పూర్తి చేస్తాం.  ఇంత నిజాయితీగా, పారదర్శకంగా ఒక వ్యవస్థను తయారు చే యడం దేశ చరిత్రలో ఎక్కడా జరుగలేదు. ఏపీ నుంచే ఇది మొదలవుతుంది.

ఎవరికైనా కూడా కాన్ఫిడెన్స్‌ బిల్డప్‌ అవుతుంది. ఏపీ పారదర్శకతలో ఆదర్శంగా నిలుస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చట్టం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
లోకాయుక్తా బిల్లును కూడా ఈ రోజు తీసుకువచ్చాం. గతంలో ఈ బిల్లు ఎందుకు లేదు అంటే దానికి సమాధానం లేదు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏపీలో లోకాయుక్తా అన్నది లేనే లేదు. అవినీతిని నిర్మూలించాలన్న ఆలోచనే వీరికి లేదు. . అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం గర్వంగా ఉందని సగర్వంగా మరొక్కసారి చెబుతూ సెలవు తీసుకుంటున్నా..

 

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.