శ్రీ ప్రహ్లాదవరదుని తో ఆముక్తమాల్యదకు కల్యాణం అయింది.
నా చిట్టి తల్లి ఆముక్తమాల్యదను (గోదా దేవిని )ప్రహ్లాదవరదునికి అప్పగిస్తున్నాను..
అప్పగింతును నీకు నా చిట్టితల్లిని
అప్పనై నేను ఆముక్తమాల్యదని
చిన్నపిల్ల ఈమె ఏమియు నెరుగదు
కన్నె పిల్లలతో కూడి కవిత చెప్పినది
నిన్నే శరణని నీ చెయ్యి పట్టినది నేడు
ఎన్నటికీ ఈమెను విడువకు ప్రహ్లాదవరదా!
సిరులివ్వలేదని చిన్న చూపు చూడక
విరులదండలోని కేశము కట్నముగానెంచి
నోరుమెదపలేని నా ముద్దుల పట్టిని
ఉరమునందుంచుకొని ఏలుకో ప్రహ్లాదవరదా!
కోపముతో నిన్ను ఎదురించి పలికినా
తప్పులేమైన చేసినా తక్కువగా చూడక
ముప్పై పాటలను మదిలో తలచుకొని
ఎప్పటికీ యీమెను నొప్పించకు ప్రహ్లాదవరదా!
- courtesy: Kidambi Sethu raman.Ahobilam,, great photo creators